తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు - karimnagar district news

ఉమ్మడి కరీంనగర్​ జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు కురవడం వల్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

rains in joint karimnagar district
ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా వర్షాలు

By

Published : Jul 23, 2020, 1:50 PM IST

ఉమ్మడి కరీంనగర్​ జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, కేశవపట్నం మండలాల్లో భారీ వర్షం పడింది. పంటలకు అనుకూలంగా వర్షాలు పడడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని హరిహరపురం సమీపంలోని ఎస్​ఆర్​ఎస్పీ ప్రధాన కాలువకు గండి పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపల్లిలోని మూలవాగు వద్ద గంగమ్మకు సర్పంచ్​ సంతోష్​ పూజలు చేశారు.

ఇవీ చూడండి: ఉమ్మడి మెదక్​ జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ఆనందంలో రైతులు

ABOUT THE AUTHOR

...view details