కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బుధవారం కురిసింది. వడగళ్ల కారణంగా మామిడి, వరి పంటలు నేలరాలాయని ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు చేతికి వచ్చే సమయంలో వడగళ్ల రూపంలో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈదురు గాలులతో వడగళ్ల వాన.. పంట నష్టం - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన బుధవారం కురిసింది. వర్షం కారణంగా చేతికి వచ్చే సమయంలో పంటలకు... వడగళ్ల రూపంలో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో వడగళ్ల వాన
కరోనా విపత్కర పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఈ సమయంలో యాసంగి పంటలో నష్టం వాటిల్లితే... అప్పులు పెరిగి అయోమయానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు కొవిడ్ లక్షణాలు తగ్గిపోయాయి: వైద్యుడు ఎంవీ రావు