మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించి బీసీలను అవమానపరిచారని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ ఆరోపించారు. సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈటల రాజేందర్‌కు మద్దతుగా నల్ల మాస్కులతో మౌనదీక్ష చేపట్టారు. ఈటలపై అవినీతి ముద్ర వేశారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
ఈటలకు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మౌనదీక్ష - protests for ex minister eetala rajender by bc welfare in karimnagar
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో మౌనదీక్ష నిర్వహించారు. ఈటలకు జరిగిన అవమానాలను నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపట్టారు.
ఈటలకు మద్దతుగా మౌన దీక్ష
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అణచివేతకు గురిచేస్తున్నారని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఏకమై కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేయాలని కోరారు. మౌన దీక్షలో రాష్ట్ర ఉపాద్యక్షురాలు వరాల జ్యోతి, కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వారాంతపు లాక్‌డౌనా..? కర్ఫ్యూ వేళల పొడగింపా..?: హైకోర్టు