తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్షమాపణ చెప్పాలి.. లేదంటే ప్రజాక్షేత్రంలో తిరగనివ్వం' - కరీంనగర్​లో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావుపై నిరసనలు

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువులందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని కరీంనగర్​ జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి డిమాండ్​ చేశారు. రామ మందిరం నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రామ్​నగర్​ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.

korutla mla vidyasagar rao, karimnagar, protests
కోరుట్ల విద్యాసాగర్korutla mla vidyasagar rao, karimnagar, protests​రావు, కరీంనగర్​, ఆందోళనలు

By

Published : Jan 22, 2021, 5:17 PM IST

హిందువులందరికీ ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు క్షమాపణ చెప్పాలని కరీంనగర్ జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి వాసుదేవ రెడ్డి డిమాండ్​ చేశారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో శ్రీ రాముని పట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ పార్టీ నాయకులు నాగసముద్రం ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రామ్​నగర్​ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.

అప్పుడు కేసీఆర్​..

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం భారత దేశంలోని ప్రతి ఒక్క హిందువు.. భాగస్వామ్యం కావాలని శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ పిలుపునిచ్చిందని వాసుదేవ రెడ్డి గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. హిందువుల పట్ల చులకనగా మాట్లాడారని అన్నారు. నేడు అదే పార్టీ ఎమ్మెల్యే హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ రాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం కట్టడానికి కొన్నేళ్లుగా పోరాటం జరిగిందని.. ఆ పోరాటంలో నాలుగు లక్షల మంది బలిదానం అయిన విషయం ఎమ్మెల్యే గుర్తు చేసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలి: సీపీఐ

ABOUT THE AUTHOR

...view details