కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అధికారులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రహదారిపై ధాన్యం తగులబెట్టి ఆందోళన చేశారు రైతులు. తూకాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా తమ ధాన్యం కొనుగోలుకు నోచుకోక అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి ధాన్యం తగులబెట్టి అన్నదాతల నిరసన - వరి ధాన్యం తగులబెట్టి అన్నదాత ల నిరసన
ఆరుగాలం కష్టపడి పంచిండిన ధాన్యాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

వరి ధాన్యం తగులబెట్టి అన్నదాత ల నిరసన
ట్రాక్టర్లతో తీసుకువచ్చిన ధాన్యాన్ని రోడ్డుమీద పోసి తగులబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన, నల్లబడ్డ ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని అధికారులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.
వరి ధాన్యం తగులబెట్టి అన్నదాత ల నిరసన
ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య
Last Updated : Nov 8, 2019, 2:29 PM IST