గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కార్పొరేషన్ రుణాలు (ట్రైకార్ రుణాలు), ఐటీడీఏ రుణాలు ఇవ్వకపోవడం శోచనీయమని కరీంనగర్లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు భీమా సాహెబ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్పొరేషన్ రుణాలు ప్రతీ ఏడాది విడుదల చేయాలని.. అర్హులైన నిరుపేద గిరిజనులకు ఇవ్వాలని కోరారు.
'ఎస్టీ కార్పొరేషన్ రుణాలను తక్షణమే ప్రకటించాలి'
గత రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కార్పొరేషన్ రుణాలు, ఐటీడీఏ రుణాలు విడదల చేయడం లేదని రాష్ట్ర గిరిజన సంఘం ఉపాధ్యాక్షుడు భీమాసాహెబ్ ఆరోపించారు. వెంటనే రుణాలు విడుదల చేయాలని కోరారు.
పేద, నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి పొందటానికి అవకాశం ఉంటుందని అన్నారు. కానీ గత 2 ఏళ్ల నుంచి రుణాలు ఇవ్వలేదన్నారు. దీనితో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణం 2020-21 యాక్షన్ ప్లాన్ ప్రకటించి, ఋణాలు ఇవ్వాలన్నారు. ఈ బడ్జెట్లో గిరిజనులకు 500 కోట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం 261 కోట్లు కేటాయించారని అన్నారు.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం