కరోనాను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు నల్లజెండాలతో వామపక్షాల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. రాష్ట్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ.. వైరస్ ఒకరి నుంచి ఒకరికి అంటుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.
కరోనా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట నిరసన - కరోనా వైరస్ వార్తలు
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు నల్లజెండాలతో నిరసన చేపట్టారు. కరోనాను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కరోనా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట నిరసన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
ఇవీ చూడండి: పూలపై కరోనా దెబ్బ... అల్లాడుతున్న రైతన్నలు