తెలంగాణ

telangana

ETV Bharat / state

'యాప్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం' - కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ తాజా వార్తలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని సీఈ కార్యాలయంలో డెసిషన్ సపోర్టింగ్ సిస్టంపై ఇంజినీర్లతో సమావేశం జరిపారు. కరీంనగర్ ప్రాజెక్టుల ఈఎన్​సీ అనిల్ కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు వారికి పలు అంశాలపై అవగాహన కల్పించారు.

Project inflow information through the app
'యాప్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం'

By

Published : Aug 20, 2020, 11:10 AM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని సీఈ కార్యాలయంలో డెసిషన్ సపోర్టింగ్ సిస్టంపై ఇంజినీర్లకు కార్యశాల నిర్వహించారు. కరీంనగర్ ప్రాజెక్టుల ఈఎన్​సీ అనిల్ కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం డెసిషన్ సపోర్టింగ్ సిస్టం మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వారు సూచించారు.

వర్షం సమాచారం

ఇప్పటి వరకు మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 12 పంపులు సిద్ధమయ్యాయని, 17 రిజర్వాయర్లు పూర్తయ్యాయన్నారు. నీటిని నింపడం, వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడం, వర్షపాతం నమోదైనప్పుడు డెసిషన్ సపోర్టింగ్ సిస్టం యాప్​లో ఇన్​ఫ్లోస్​ను అప్రమత్తం చేస్తాయని వెల్లడించారు.

పంపుల నిర్వహణ..

ఆ సమయంలో పంపుల నిర్వహణకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. యాప్ విజయవంతమైతే త్వరలో అన్ని ప్రాజెక్టుల్లో అమలు చేస్తామని ఈఎన్​సీలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్ఈలు, ఈఈలు, డీఈఈలు, జేఈఈలు, 50 మంది ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :చేపల వేటకు వెళ్లి ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details