Kaleshwaram: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీని ఎత్తిపోతలకు సన్నాహాలు చేస్తున్నారు. వరద కాల్వకు సమాంతరంగా కాల్వ తవ్వేందుకు భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు. పరిహారం తేల్చకుండానే భూములు తీసుకోవడంపై అన్నదాతలు ఆందోళన ఉద్ధృతం చేస్తున్నారు. మెరుగైన పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని నినదిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు, గంగాధర, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాల్లోని భూములు సేకరించే ప్రక్రియ ప్రారంభంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలుచోట్ల నిరసనలు చేపట్టి అధికారులను చేస్తున్న సర్వేను అడ్డుకుంటున్నారు.
సర్వేపై కర్షకుల ఆగ్రహం