కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, గన్నేరువరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కళ్లముందే నీటి పాలు అవ్వటం వల్ల రైతులు కడుపుకోతను దిగమింగుకుంటూ కన్నీటి పర్యంతమైయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంటలన్నీ వర్షార్పణం కాగా పెట్టిన పెట్టుబడులు నోచుకోని పరిస్థితి అన్నదాలకు నెలకొంది.
అకాల వర్షం... అన్నదాతల దైన్యం
కుండపోతగా కురిసిన వర్షం రైతులకు గుండెకోత మిగిల్చింది. వరుస వానల జోరుకు రైతులు కంటతడి పెడుతున్నారు. వరుణుడి ప్రతాపానికి అతివృష్టి వెంటాడుతోంది. పొట్ట దశకు వచ్చిన వరి పంట నెలకొరిగింది.
అకాల వర్షం... అన్నదాతల దైన్యం