ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన ప్రజావాణి కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో నేడు పునఃప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ శశాంక సహా అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలను లోపలికి అనుమతించారు.
జిల్లాలో సుమారు 11 నెలల తరువాత ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభం కాగా భారీ స్పందన లభించింది. తొలిరోజు 123 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని... వాటిని తహసీల్దార్లు పరిష్కరించాలని సూచించారు.