పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లాలో చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతినగర్ కార్పొరేటర్ రాపర్తి విజయ దంపతులకు పవర్‌స్టార్ అభిమానులు పూలమొక్కలు అందజేశారు. పవన్‌కల్యాణ్ మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని... ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
ఇంటింటికి మొక్కలు పంచుతూ పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు - power star pawan kalyan birthday celebrations at karimnagar
కరీంనగర్లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు దోగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ఇంటింటికి పూల మొక్కలు పంపిణీ చేశారు.
ఇంటింటికి మొక్కలు పంచుతూ పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకలు
పవన్‌కల్యాణ్... జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రజలకు అవగాహన కల్పించాలని దోగ్గలి శ్రీధర్ కోరారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తులు అందరూ త్వరగా కోలుకోవాలని.. ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థించారు.