అధికార పార్టీ అక్రమాల వల్లే కరీంనగర్లో ఎన్నికలు రెండు రోజులు ఆలస్యమయ్యాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులు గెలుపు కోసం ఇష్టారాజ్యంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు.
'కరీంనగర్లో అవినీతిని వెలికితీసే అవకాశమివ్వండి' - కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలపై పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం
కరీంనగర్ నగరపాలక సంస్థలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తెరాస పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
'అవినీతిని ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి'
తెరాస, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని, ఆ పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. కరీంనగర్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు ఒక ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్ శివారులో మారని తీరు