కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూముల విషయంలో కొందరు వ్యక్తులు చాలా అవకతవకలకు పాల్పడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనప్పటికీ... కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కలెక్టర్, పోలీస్ కమిషనర్.. కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ... అవకతవకలు జరుగుతున్నాయన్నారు.
'విచ్చలవిడిగా భూముల కబ్జాకు పాల్పడుతున్నారు' - కరీంనగర్ భూములపై పొన్నం వ్యాఖ్యలు
కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూముల విషయంలో కొందరు చాలా అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.
'విచ్చలవిడిగా భూముల కబ్జాకు పాల్పడుతున్నారు'
సామాన్యుల, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్న ఘటనలు కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక అధికారి లేదా జడ్జిని నియమించి ఈ మొత్తం స్థలాలపైన విచారణ జరిపించాలని కోరారు. సామాన్యుల స్థలాలను తిరిగి వారికి ఇప్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీ, డీజీపీని కోరారు.