రైతుల కోసం పొన్నం ప్రభాకర్ దీక్ష - ponnam prabakar goud latest news
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు.
![రైతుల కోసం పొన్నం ప్రభాకర్ దీక్ష ponnam prabakar goud fight for fermers in karimnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6970690-thumbnail-3x2-ponnam.jpg)
రుక్మాపూర్‌లో పొన్నం ప్రభాకర్ దీక్ష
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం దీక్ష చేపట్టారు. ధాన్యం తూకంలో కోత విధిస్తున్నారని అన్నారు. అధికారులు, మిల్లర్లు కలిసి తూకంలో జాప్యం చేస్తూ అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.