తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ వెంట వాళ్లుంటే ప్రచారానికి ఎందుకు రావడం లేదు? - మీ వెంట వాళ్లుంటే ప్రచారానికి ఎందుకు రావడం లేదు?

కరీంనగర్​లో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​... కేటీఆర్​ తీరుపై విరుచుకుపడ్డారు. తెరాస వెంట జగన్​, మమత, అఖిలేష్​ అందరు ఉంటే...ఎందుకు ప్రచారానికి రావడం లేదని ప్రశ్నించారు. అంతా మావెంటే అంటూ గొప్పగా ప్రకటనలు ఎందుకు అని విమర్శించారు.

కేటీఆర్​పై మండిపడ్డ పొన్నం ప్రభాకర్​

By

Published : Apr 2, 2019, 1:46 PM IST

కేటీఆర్​పై మండిపడ్డ పొన్నం ప్రభాకర్​
తెరాస నాయకులను చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడే పరిస్థితి ఉందని కరీంనగర్​ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్​ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడిపై మండిపడ్డారు. కేటీఆర్​... 16మంది ఎంపీలను గెలిపిస్తే ఫెడరల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతూ.. జగన్‌, మమత, అఖిలేష్‌ అందరు తమ వెంటే ఉన్నారని గొప్పగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ వాళ్లంతా తెరాస వెంట ఉంటే ఎన్నికల ప్రచారానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఏపీలో బాబుకు మద్దతు ఇస్తున్న మమత బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఫరూక్‌ అబ్దుల్లా ప్రచారానికి వచ్చారని పొన్నం గుర్తు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details