తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే దేశంలో ఆర్థికమాంద్యం' - tpcc updates

తెలంగాణలో మూడు లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

By

Published : Nov 8, 2019, 9:49 PM IST

కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

కరీంనగర్​లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులు పట్టుకుని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతో దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకతవకలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details