ఆత్మహత్యకు పాల్పడిన ఓ మహిళను రక్షించి మానవత్వం చాటుకున్నారు పోలీస్ సిబ్బంది. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన మహిళ చెరువులో దూకి బలవన్మరణానికి యత్నించింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి సమీపంలోని తుమ్మల చెరువు వద్ద జరిగింది.
ఆత్మహత్యకు యత్నించిన మహిళ... రక్షించిన పోలీసులు - కరీంనగర్ జిల్లా వార్తలు
ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ ప్రాణాలు కాపాడారు పోలీస్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి గ్రామానికి చెందిన మహిళ తుమ్మల చెరువులో దూకగా...ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించారు. వారు చూపిన ధైర్యానికి గ్రామస్థులందరూ పోలీసులను అభినందించారు.

మహిళను రక్షించిన సైదాపూర్ పోలీసులు
ఆత్మహత్యకు యత్నించిన మహిళను రక్షించిన పోలీసులు
హుటాహుటిన వచ్చి కాపాడారు...
సమాచారం అందుకున్న సైదాపూర్ కానిస్టేబుల్ పార్థసారథి, హోంగార్డు సురేశ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి చెరువులో మునిగిపోతున్న మహిళను ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆమెను క్షేమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు చూపిన ఔదార్యానికి ఆ మహిళ కుటుంబసభ్యులు, గ్రామస్థులు వారిని అభినందించారు.