కరీంనగర్ మండలం చేగుర్తికి చెందిన స్వప్న, రామస్వామి దంపతులు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై నాకా చౌరస్తా వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వాహనంపై ఉన్న స్వప్న ఒక్కసారిగా కిందపడి స్పృహ కోల్పోయింది. కరోనా భయంతో దంపతులకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
బైక్ పైనుంచి పడిన మహిళ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు - telangana latest news
ద్విచక్రవాహనం పైనుంచి కిందపడి స్పృహ కోల్పోయిన ఓ మహిళ పట్ల పోలీసులు తమ మానవత్వాన్ని చాటారు. వైరస్ భయంతో ఎవరూ ముందుకు రానివేళ.. మేమున్నామంటూ బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
![బైక్ పైనుంచి పడిన మహిళ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు బైక్ పైనుంచి పడిన మహిళను ఆస్పత్రికి తరలించిన పోలీసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11800775-862-11800775-1621313124477.jpg)
బైక్ పైనుంచి పడిన మహిళను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాజయ్య, కానిస్టేబుల్ కొమురయ్యలు వీరిని గమనించారు. వెంటనే స్పందించి స్థానికుల సాయంతో బాధితురాలిని రోడ్డు పైనుంచి పక్కకు తీసుకొచ్చారు. మంచినీళ్లు తాగించి, చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన పోలీసులను పలువురు అభినందించారు.