కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయాన్ని ప్రారంభించారు. గ్రామ దేవతలు భూలక్ష్మీ, మహాలక్ష్మీ, పోచమ్మ తల్లి విగ్రహాలతో పాటు బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వేద పండితులు క్రిష్ణమాచారి ఆధ్వర్యంలో పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోచమ్మ తల్లి ఆలయాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల
హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
పోచమ్మ తల్లి ఆలయాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల
అమ్మవార్లను దర్శించుకొని.. టెంకాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ విశిష్ఠతను గ్రామ సర్పంచ్ తాటికొండ పుల్లాచారిని అడిగి తెలుసుకొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు మంథెన శ్రీనివాస్, ఉప సర్పంచ్ చింత మానస, జడ్పీటీసీ సభ్యుడు పడిదం బక్కారెడ్డి, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై
TAGGED:
eetala rajendar latest