తెలంగాణ

telangana

ETV Bharat / state

రుణ మంజూరులో ఆలస్యం.. వీధి వ్యాపారుల పాలిట శాపం - pm street vendors athma nirbhar scheme

ప్రతిరోజు కష్టపడితే తప్ప జీవనం సాగించని పరిస్థితిలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ మరింత దుర్భరం చేసింది. వీరంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా చిరు వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్‌’ స్వనిధి పథకంలో సూక్ష్మ రుణాలు పొందేందుకు అవకాశం కల్పించింది. పట్టణాలు, నగరాల్లో చిరు వ్యాపారులు రుణాలు పొందడానికి ఆయా మున్సిపాలిటీల్లో గుర్తింపు పొంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే చాలు వారి ఖాతాల్లో రుణాలు జమ కావాల్సి ఉండగా మంజూరులో జాప్యం ఏర్పడుతోంది.

delay in street vendors funds release
రుణ మంజూరులో ఆలస్యం

By

Published : Oct 30, 2020, 1:15 PM IST

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని పుర, నగరపాలికల పరిధిలో వీధి వ్యాపారుల సంఖ్య పెరిగింది. కరోనా కారణంగా పలు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి దూరమవ్వడంతో వారంతా రోడ్డు మీద పడ్డారు. ఇంకేముంది బతుకుబండి లాగేందుకు వీధుల్లో నిత్యావసర వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తప్ప మిగతా వ్యాపారాలు సక్రమంగా నడవడం లేదు. పైగా లాక్‌డౌన్‌ కంటే ముందు నుంచి రోడ్ల మీది చిరు వ్యాపారులు అప్పులు చేసి సామగ్రి తెచ్చుకునే వారు. వీరందరిని ఆదుకోవడం కోసం, ఉపాధి అవకాశాలు మెరుగు పర్చడం కోసం ఆర్థికంగా భరోసా నింపేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి, ఆత్మ నిర్భర్‌ పేరుతో రుణాలు అందిస్తోంది.

రూ.10వేల చొప్పున రుణం మంజూరు

ప్రతి వీధి వ్యాపారికి రూ.10వేలు బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తున్నారు. పుర, నగరపాలికల్లోని వీధివ్యాపారులు దీని కింద రుణాలు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, అప్పులు తీసుకోకుండా ఈ నిధులను పెట్టుబడిగా పెట్టి ఉపాధి పొందాలనే లక్ష్యంతో రుణాలు అందిస్తున్నారు. తిరిగి సక్రమంగా చెల్లిస్తే మళ్లీ రుణం పొందే వీలుంది.

లబ్ధిదారులు ఎక్కువ.. మంజూరు తక్కువ

పట్టణాలు, నగరాల్లో వీధివ్యాపారులను గుర్తించి పీఎం స్వనిధి కింద రుణాలు ఇచ్చేందుకు అప్పటికప్పుడూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండగా వీరి సంఖ్య పెరిగిపోయింది. ఒకే చోట కాకుండా వీధుల్లో తిరుగుతున్న ప్రతి వీధివ్యాపారి దీనికి అర్హులుగా నిర్ణయించారు. ఇంకేముంది ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌ జిల్లాలోనే వీధివ్యాపారులు ఎక్కువగా ఉండగా రుణాలు మంజూరులో మాత్రం తక్కువ శాతమే ఉంది. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో వీధివ్యాపారులు తక్కువగా ఉండగా కాస్తా మెరుగ్గానే రుణాలు అందించారు. చిన్న పురపాలికల పరిధిలో 72శాతం నుంచి 88శాతం వరకు రుణాలు అందించారు. జనాభా ఎక్కువగా ఉన్న పట్టణాలు, నగరాల్లో రుణాలు ఎక్కువ సంఖ్యలో మంజూరు చేస్తే లబ్ధిదారులకు వెసులుబాటు ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details