PM Modi Speaks To Karimnagar Farmer :కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని 2.7 లక్షల పంచాయతీల్లో, ఆయా పథకాల అర్హులను గుర్తించి, వారికి ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కరీంనగర్ జిల్లా రైతుతో ముచ్చటించారు. చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లికి చెందిన రైతు మావురం మల్లికార్జునరెడ్డితో వర్చువల్ విధానంలో ప్రధాని 5 నిమిషాలు సంభాషించారు.
విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించింది : మోదీ
PM Modi Spoke a Farmer From Karimnagar District :వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఫిబ్రవరి 2024 వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి అనుకున్న లక్ష్యాలను చేరుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తెలిపారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ సంచాలకులు యోగేశ్ మోహన్ దీక్షిత్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఇద్దరు ఆడపిల్లలా- అదృష్టవంతులు
ప్రధాని : మీ గురించి చెప్పండి
రైతు :సర్ నా పేరు మల్లికార్జునరెడ్డి. సమీకృత వ్యవసాయం చేస్తున్నాను. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ఇష్టమైన సేంద్రియ సాగు విధానంలో పంటలు పండిస్తున్నాను. లాభాలు గడిస్తున్నాను.
ప్రధాని :సమీకృత సేంద్రియ వ్యవసాయం ఎందుకు అవలంబిస్తున్నారు?
రైతు :కల్తీ లేని ఉత్పత్తులతోపాటు నాణ్యమైన దిగుబడులు వస్తాయి తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
ప్రధాని :ఇంత చదువుకొని వ్యవసాయం వైపు ఎందుకు వచ్చారు?
రైతు : నాకు చిన్నప్పటి నుంచి సేద్యంపై ఆసక్తి ఎక్కువ. అది కాకుండాతల్లిదండ్రులు చేస్తున్న వ్యవసాయానికి అండగా ఉండటంతోపాటు చదువుకున్న వారు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఇటు వైపు వచ్చాను.