తెలంగాణ

telangana

ETV Bharat / state

మీనరాశి వారికి ప్లవ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే... - మీన రాశి ఫలాలు

మీనరాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11 ఉంటుంది. వ్యయం 5 ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటాయి.

Pisces rashi in 2021
మీనరాశి

By

Published : Apr 13, 2021, 12:02 PM IST

ఆదాయం 11; వ్యయం 5;

రాజపూజ్యం 2; అవమానం 4

మీనరాశి వారికి బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి. తలచిన పనులు త్వరగా అవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పెద్దలను మెప్పిస్తారు. ఉద్యోగాల్లో సుస్థిరమైన ఫలితాలున్నాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. వృత్తుల్లో రాణిస్తారు. కోరుకున్న జీవితం లభిస్తుంది. అవరోధాలు తొలగిపోతాయి. సమాజంలో విశేషమైన ఖ్యాతి లభిస్తుంది.

బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. ధనధాన్య యోగాలున్నాయి. గృహ వాహనాది సౌఖ్యం ఉంది. విశేష భూలాభం సూచితం. అధికార పదవీ లాభాలున్నాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.మంచి పనులతో గొప్పవారు అవుతారు. గురు, కేతు శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది.

ఇదీ చదవండి:ప్లవ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకున్నారా?

ABOUT THE AUTHOR

...view details