తెలంగాణ

telangana

ETV Bharat / state

పంటలకు డ్రోన్​తో పురుగు మందుల పిచికారి - డ్రోన్ పిచికారి విధానం

వ్యవసాయ రంగంలో రైతుల అవసరాల మేరకు కొత్త ఆవిష్కరణలు రావాలని మంత్రి ఈటల రాజేందర్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో డ్రోన్‌ యంత్రంతో పంటలపై పురుగు మందుల పిచికారి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. డ్రోన్​ పనితీరు విధానాన్ని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

Pesticide spray with drone for crops at huzurabad
పంటలకు డ్రోన్​తో పురుగు మందుల పిచికారి

By

Published : Mar 11, 2021, 4:06 PM IST

వ్యవసాయ రంగంలో అనేక కొత్త కొత్త రకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా మంత్రి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సందర్శించారు. ఈ కేంద్రంలో డ్రోన్‌ యంత్రంతో పంటలపై పురుగు మందుల పిచికారి కార్యక్రమంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, తదితరులు హాజరయ్యారు.

మంత్రి ఈటల డ్రోన్‌ యంత్రాన్ని పరిశీలించి.. పురుగు మందుల పిచికారి విధానాన్ని చూశారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నీలం వెంకటేశ్వర్‌రావును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక కొత్త టెక్నాలజీ వస్తే అన్ని దేశాలకు విస్తరిస్తుందన్నారు. మనిషి అభివృద్ధికి సాంకేతికత తోడ్పడుతుందని పేర్కొన్నారు. పంటల సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకునే విషయమై పరిశోధనలు జరగాలని మంత్రి శాస్త్రవేత్తలకు సూచించారు. మానవ శ్రమ కూడ తగ్గించే విషయమై రీసెర్చ్‌ చేయాలని సూచించారు.

ఇదీ చూడండి :రుణ యాప్‌ల కేసులో మరొకరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details