రాష్ట్రంలో లాక్డౌన్ గడువు పొడగించిన దృష్ట్యా... ప్రజలు ఇబ్బంది పడకూడదని కరీంనగర్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేపట్టారు. కాపువాడ చౌరస్తాలో 6, 29, 30 డివిజన్లలోని సుమారు 3 వందల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
పంపిణీ కార్యక్రమాల్లో నియమాలకు నీళ్లొదులుతున్న ప్రజలు - LOCK DOWN UPADATES IN KARIMNAGAR
కరీంనగర్లో చేపట్టిన కూరగాయల పంపిణీ కార్యక్రమంలో ప్రజలు నిబంధనలకు నీళ్లొదిలారు. సామాజిక దూరం పాటించకుండా మాస్కులు ధరించకుండా కూరగాయల కోసం లైన్లలో నిల్చున్నారు.
పంపిణీ కార్యక్రమాల్లో నియమాలకు నీళ్లొదులుతున్న ప్రజలు
ఈ కార్యక్రమంలో ప్రజలు భౌతిక దూర నిబంధన, మాస్కులు ధరించకుండానే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని పలువులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి:ఉప్పు ఎక్కువ తింటే కరోనా వచ్చే ముప్పు!
Last Updated : Apr 13, 2020, 2:17 AM IST