కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో పుల్వామా అమర వీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
పుల్వామా అమరులకు ఘనంగా శ్రద్ధాంజలి - tributes to the soldiers killed in the Pulwama attack
పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాలలోని ప్రజలు నివాళులు అర్పించారు. సాయంత్రం వేళ కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి వారి త్యాగాలను స్మరించుకున్నారు.
పుల్వామా అమరులకు ఘనంగా శ్రద్ధాంజలి
చొప్పదండి, రామడుగు, గోపాల్ రావుపేటతో పాటు.. గంగాధర, కొడిమ్యాల, మల్యాల, బోయినపల్లిల్లో అమరులకు నివాళులు అర్పించారు. సాయంత్రం వేళ కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. పుల్వామా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. దేశ రక్షణకు అమరవీరుల త్యాగాలు వెల కట్టలేనివని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కేంద్రాన్ని ప్రశాంతంగా ఉండనీయం: టికాయిత్