తెలంగాణ

telangana

ETV Bharat / state

స్మార్ట్​సిటీల్లో.. పాదచారుల భద్రత గాల్లో దీపమేనా..? - ఎల్‌ఈడీ స్టిక్కర్లు

రాష్ట్రంలో కోట్ల రూపాయలతో రహదారులు నిర్మిస్తున్నా.. పాదచారుల పట్ల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్‌ స్మార్ట్​సిటీ జాబితాలో చేరాక.. కొత్త రహదారులు ఏర్పడటంతో వాహనాలు రయ్‌ రయ్‌మని దూసుకుపోతుంటే, రోడ్డు దాటాల్సిన పాదచారులు మాత్రం ఎప్పుడెప్పుడు ట్రాఫిక్ ఆగుతుందా అని కళ్లప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది.

Pedestrians in Karimnagar are facing severe problems
స్మార్ట్​సిటీల్లో.. పాదచారుల భద్రత గాల్లో దీపమేనా..?

By

Published : Jan 20, 2021, 1:21 PM IST

కరీంనగర్‌‌లో జాతీయ రహదారులను సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినా... తగిన నిబంధనలు పాటించకపోవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరాన్ని స్మార్ట్​సిటీగా మార్చే క్రమంలో భారీ ఖర్చు చేసి నిర్మాణాలైతే చేపట్టారు కానీ, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడంతో.. పాదచారుల భద్రత గాలిలో దీపంలా మారింది.

రోడ్లు, భవనాల శాఖ అధికారులు.. నగరంలో చాలా చోట్ల జీబ్రా క్రాసింగ్స్‌, ఎల్‌ఈడీ స్టిక్కర్ల లాంటి కనీస ఏర్పాట్లను చేయలేదు. ఆ కారణంగా రోడ్డు దాటడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత త్వరగా రహదారులు నిర్మించారో.. అంతే వేగంగా తమ ఇబ్బందులను తొలగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

నగరంలోని పలు రోడ్డు మార్గాల్లో.. పాదచారుల ఇబ్బందులు.. తమ దృష్టికి వచ్చాయి. రూ. 2కోట్లతో పలు రకాల అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయించాం. 17రోడ్‌ క్రాసింగ్‌లతో పాటు 23కూడళ్ల వద్ద అవసరమైన చోట్ల సిగ్నల్స్‌, ట్రాఫిక్ చిహ్నాలు ఏర్పాటు చేస్తాం. రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌‌ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం చేపడతాం.

- నగర మేయర్ సునీల్‌రావు

ఇదీ చదవండి:'ఎన్నికల నగారా మోగబోతోంది.. పనుల్లో వేగం పెంచండి'

ABOUT THE AUTHOR

...view details