కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలో లాక్డౌన్ విధించారు. గత వారం వేరే గ్రామానికి పండగకు వెళ్లిన వారంతా అస్వస్థతకు గురికావటంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల్లో 53మందికి వ్యాధి నిర్ధారణ కావటంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.
53 మందికి కరోనా... స్వచ్ఛందంగా లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకుని పాటిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని పెద్దకుర్మపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు.
53 మందికి కరోనా... స్వచ్ఛందంగా లాక్డౌన్
వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా పంచాయతీ పాలకవర్గం లాక్డౌన్ తీర్మానించింది. ప్రజలందరూ సహకరించాలని కోరారు. కేసులు పెరుగుతుండడంతో పలు గ్రామాలు ఇప్పటికే స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నాయి.
ఇదీ చూడండి:కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలేంటి?