తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్‌ ఎక్కడున్నా... ఆరోగ్యంగా ఉండాలి : పొన్నం ప్రభాకర్ - పొన్నం ప్రభాకర్‌ వార్తలు

కరోనా చికిత్సను ఆరోగ్రశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు. ఏపీలో చేర్చారని పేర్కొన్నారు. అన్ని పార్టీలనుంచి ఇదే డిమాండ్ ఉందని తెలిపారు. జిల్లా కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు చేయాలని పొన్నం కోరారు.

PONNAM PRABHAKAR
PONNAM PRABHAKAR

By

Published : Jul 10, 2020, 5:08 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ కిందకు చేర్చిన విధంగా తెలంగాణలోనూ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావాలని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కడున్నా... ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నుంచి మీపై ఒత్తిడి వచ్చినా... రాకపోయినా... అన్ని రాజకీయ పార్టీలు కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావాలని కోరుతున్నాయని వివరించారు. విద్య, వైద్యం రెండూ పేదలకు అందేట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకే ఉంటుందన్నారు.

జిల్లాల్లో పారదర్శకంగా పరీక్షలు చేయాలని పొన్నం డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, పరీక్షలు లేని కారణంగా అనిశ్చితి నెలకొన్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహించి... బులిటెన్‌ను విడుదల చేసి ప్రజలు అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సీఎం కేసీఆర్‌ ఎక్కడున్నా... ఆరోగ్యంగా ఉండాలి : పొన్నం ప్రభాకర్

ఇదీ చదవండి:కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారం

ABOUT THE AUTHOR

...view details