కేసీఆర్ కేబినేట్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్... మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్ ఉప ఎన్నిలను (huzurabad by poll) కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదన్న వాదన పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది (congress prepare campaign team). అభ్యర్థి ప్రకటన దగ్గర నుంచి ప్రచారం వరకు ఎందులోనూ సీనియర్ నాయకులు ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదు. నామినేషన్ వేసే సమయంలో కొందరు సీనియర్లు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అయితే ఈ ఉప ఎన్నికను తెరాస, భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదే రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే అభ్యర్థి ఎంపిక నుంచి మీనమేషాలు లెక్కించిన కాంగ్రెస్ పార్టీ చివరకు ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరిలో దింపింది.
గ్రూపు రాజకీయాలతో లోపించిన ఐకమత్యం
కాంగ్రెస్‌లో స్వేచ్ఛ అధికం కావడంతో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణం. ప్రస్తుతం పీసీసీ నూతన చీఫ్ రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) వచ్చాక... ఆయన అనుకూల వర్గం, వ్యతిరేక వర్గాలు రెండు గ్రూపులుగా నాయకులు విడిపోయారు. పైకి నాయకులు అంతా కలిసిమెలిసి కనిపించినా.. లోలోన మాత్రం రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. ఈ ప్రభావం హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంపై కూడా పడుతోంది. పార్టీలో ముఖ్య నేతలెవరూ కూడా హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడటం లేదు (congress prepare campaign team).
కన్నెత్తి చూడని స్టార్ క్యాంపెయినర్లు
స్టార్ క్యాంపెయినర్లుగా 20 మందితో కూడిన జాబితాను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది (congress prepare campaign team). పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. అయితే వీరిలో ఒక్కరు కూడా ఇప్పటి వరకు హుజురాబాద్ గడ్డపై అడుగు పెట్టలేదు. పీసీసీ చీఫ్ రేవంత్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి మాత్రం నామినేషన్ సమయంలో హుజురాబాద్ వెళ్లి వచ్చారు.
రంగంలోకి దిగిన రేవంత్