కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 8 నెలల వేతనాలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. బకాయిలు సకాలంలో చెల్లించకపోతే ఈనెల 22 నుంచి సమ్మెకు దిగుతామని సీఐటియు జిల్లా కార్యదర్శి బండారు శేఖర్ హెచ్చరించారు. నగరపాలక కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వేతనాలు రాకపోవడం వల్ల కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా... సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు. కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు.
పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించండి
కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించకుంటే ఈనెల 22 నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్చరించింది.
వేతనాలు చెల్లించండి