తెలంగాణ

telangana

ETV Bharat / state

పాములు పాలు తాగవు అవి మాంసాహారులే - మాంసాహారులే

నాగుల చవితి వస్తే చాలు ప్రతి నగరంలో మహిళలు పుట్టలో పాముకు పాలు పోసి పూజలు చేస్తారు. కానీ అలా చేయడం వల్ల పాములు చనిపోతాయి తప్ప పుణ్యమేమి రాదని అంటున్నారు కరీంనగర్ అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి చంద్రమౌళి.

పాములు పాలు తాగవు అవి మాంసాహారులే

By

Published : Aug 4, 2019, 9:37 PM IST

రేపు నాగుల చవితిని పురస్కరించుకుని పాము పుట్టల వద్ద మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి కోడి గుడ్లు పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలాంటివి చేయడం వల్ల పాములు చనిపోతాయి తప్ప పుణ్యం ఏమి రాదని కరీంనగర్ అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి చంద్రమౌళి అన్నారు.

పాములు పాలు తాగుతాయా అనే అంశంపై ఆయన వన్యప్రాణి సంరక్షణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పాములు మాంసాహారులే కానీ శాకాహారులు కావని అన్నారు. పాములకు ఆహారం దొరకక చాలా రోజుల వరకు దాహంతో ఉన్నప్పుడు మాత్రమే దాహం తీర్చుకోవడానికి పాలు, నీళ్లు తాగే అవకాశం ఉందన్నారు. జెర్రిపోతు పాముతో ఓ యువకుడు డెమో చేసి చూపించాడు. అన్ని సర్పాలు విషాన్ని కలిగి ఉండవని, కొన్నిటికి మాత్రమే విషం ఉంటుందని ఆయన తెలిపారు.

పాములు పాలు తాగవు అవి మాంసాహారులే

ఇదీ చూడండి : అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతి

ABOUT THE AUTHOR

...view details