Paddy Purchase Issue in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దసరాకు ముందు నుంచే వరికోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం ఎప్పుడెప్పుడు అమ్ముకుందామా అని రైతులు ఎదురు చూస్తున్నారు. సర్కార్ మాత్రం దీపావళి తర్వాత కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రకటించింది. చాలా చోట్ల కేంద్రాలు ప్రారంభించినా.... అక్కడ కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాలేదు. రైస్‌మిల్లుల కేటాయింపు, ఖాళీ సంచులను సమకూర్చే ప్రక్రియ పూర్తి కాలేదు.
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశుల వద్ద 15 రోజులుగా అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. తేమ నిబంధనతో రైతులు పగలంతా ఎండకు వడ్లను ఎండబెట్టినప్పటికీ, రాత్రిళ్లు కురిసే మంచుతో మళ్లీ యథాస్థితికి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేస్తుండటంతో, రైతులు వ్యాపారులకు అమ్ముకొనేందుకు సిద్ధమవుతున్నారు.