Paddy Cultivation Telangana : శ్రీరాంసాగర్‌తో పాటు మధ్యమానేరు, దిగువమానేరు జలాశయాలు గత మూడేళ్లుగా నిండుకుండగా ఉండటంతో రైతులకు నిరంతరం నీటిసరఫరా సాగింది. ప్రస్తుతంపై నుంచి దిగువమానేరు జలాశయానికి నీరువచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టుల్లోని నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉందని అధికారులు సూచిస్తున్నారు. గత యాసంగిలో ముమ్మరంగా నీటిసరఫరా చేయడమే కాకుండా సూర్యాపేట జిల్లా వరకు తరలించారు.
"ఈసారి తగినంత నీటి నిల్వ లేనందుకు ఆరుతడి పంటలు వేయమని రైతులకు సూచించాం. మధ్యమానేరు 23 టీఎంసీలు, దిగువమానేరులో 19 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. తాగునీరుతో కలిపి 27 టీఎంసీలు ఉంది. వరిసాగుకు నీరు సరిపోదు కనుక ఆరుతడి పంటలకు చాలా అనుకూలం, అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగ పరుచుకోవాలి." -శివకుమార్, ఎస్‌ఈ దిగువమానేరు జలాశయం
Dry Crops in Karimnagar : అయితే ఇటీవలి వర్షాలకి వరద ప్రవాహం వస్తుందేమోనన్న ఉద్దేశంతో కాకతీయ కాల్వ ద్వారా నిరంతరం విడుదలచేశారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడం మేడిగడ్డ మరమ్మతులు ఇతరత్ర కారణాలతో ప్రస్తుతం నీరు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Slight flood in SRSP : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు స్వల్పవరద..
"కరీంనగర్ జిల్లాలో మధ్యమానేరు, దిగువమానేరులో ఎక్కువ భాగం దిగువమానేరు నుంచి లక్ష 50 వేల ఎకరాల వరకు సాగు అవుతుంది. అధికార లెక్కల ప్రకారం 19 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. ఈ 19 టీఎంసీలు వారబంధి పద్ధతిలో ఇస్తామని చెప్పాం. రైతులు తొందరగా నాట్లు వేయాలని చెప్పాం. ఆరుతడి పంటైనా మొక్కజొన్న గతసారి కంటే ఎక్కువ మొత్తంలో పంట వేయాలని పోత్సహిస్తున్నాం." -వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి