తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో కరీంనగర్ జిల్లాలోని మద్యం దుకాణాలు మందుబాబులతో కిటకిటలాడాయి. రేపు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పటం వల్ల ఇక వైన్ షాపులు తెరిచే అవకాశం లేదనుకొని మద్యం ప్రియులు వైన్స్ ఎదుట క్యూ కట్టారు.
లాక్డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాల వద్ద రద్దీ - వైన్స్ ఎదుట మద్యం ప్రియుల క్యూ
ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించగానే మందుబాబులు అప్రమత్తమయ్యారు. మద్యం కోసం వైన్ షాప్ల ఎదుట క్యూలు కట్టి మరి మందు కొనుగోలు చేస్తున్నారు.
లాక్డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాల వద్ద రద్దీ
వేల రూపాయలు ఖర్చు పెట్టి పదిరోజులకు సరిపోయే మద్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలోని అన్ని రోడ్లు మందుబాబులతో కిక్కిరిసిపోయాయి.
ఇవీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు