Opposition Parties Election Campaign in Telangana 2023 : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేలా విపక్షాలు ప్రచారం(Telangana Election Campaign)లో జోరును పెంచాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ సమక్షంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల ముందు పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకుని.. కాంగ్రెస్‌కే ఓటు వేయండని పీసీసీ కార్యనిర్వాక అధ్యక్షుడు, ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్ సూచించారు.
Congress Campaign in Khammam :ఖమ్మంలోనూ అన్ని పార్టీల నాయకులు ఎన్నికల్లో ప్రచార జోరు పెంచారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల్లోకెళ్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ(Congress Party Rally in Mancherial) నిర్వహించగా.. మందమర్రి నుంచి ప్రారంభించిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకోని, దాచుకుందని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు విమర్శించారు.
Komatireddy Rajagopal Reddy Election Campaign : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఫైరవీల రాజ్యం కొనసాగుతుందని నిర్మల్ జిల్లా మథోల్ నియోజకవర్గ నాయకుడు కిరణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక వర్గంలో దాదాపు 100 కుటుంబాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జై వీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka) ఇంటిటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు.
బీఆర్‌ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారాలు
BJP MP Dharmapuri Arvind Campaign in Metpally : ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Goa CM Pramod Sawant) పర్యటించారు. బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్ లింగంపల్లిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా తిరిగి పాదయాత్ర నిర్వహించారు.