హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుంది (huzurabad by election campaign). తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు ప్రచారం చేశారు. చెల్పూర్, మల్లారెడ్డిపల్లితోపాటు వీణవంక మండలం చల్లూరులో రోడ్‌షో నిర్వహించారు. తెరాస ప్రభుత్వం అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతుంటే... భాజపా నేతలు చెప్పుకోవటానకి ఏమీ లేక అబద్ధాలు చెబుతున్నారంటూ విమర్శించారు (Harish Rao comments on etela rajender). ఈటల రాజేందర్ స్వలాభం కోసమే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలను వ్యతిరేకించిన ఈటల..... ఇప్పుడు అదే పార్టీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. నల్లచట్టాలు పార్టీ మారగానే రంగు మారాయా అని ఎద్దేవా చేశారు. అందువల్లే ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. (huzurabad by election campaign) తెరాస ప్రభుత్వం అభివృద్ది గురించి మాట్లాడుతుంటే భాజపా... ఝూటా మాటలతో ఓట్లు దండుకొనే యత్నం చేస్తోందని హరీశ్ రావు అన్నారు.
కౌంటర్ ఇచ్చిన ఈటల
తెరాస నేతలపై భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శనాస్త్రాలు సంధించారు (etela rajendar comments on trs). ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం చల్లూరులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు (huzurabad by election campaign). గులాబీ జెండాకి ఓనర్లమని అన్నందుకు ముఖ్యమంత్రి తనను పదవి నుంచి తొలగించారని తెలిపారు. కొడుక్కి పోటీ వస్తున్నానని బయటకు పంపించారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో గెలుస్తామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.