కరీంనగర్-వరంగల్ రహదారిలోని చెంజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా ఫోరండ్ల నుంచి హుజురాబాద్ వెళ్తున్న అఖిల్ రెడ్డి వరంగల్ వైపు వెళ్తున్న లారీని ఢీకొన్నాడు. వాహనం లారీ కిందికి పూర్తిగా చిక్కుకొని ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అఖిల్ రెడ్డి ఇటీవలే ఇన్నోవా వాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనాన్ని అద్దె ప్రాతిపదికన నడిపిస్తుంటాడు. తానే స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ హుజురాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకోగా పోలీసులు వెంటనే అతన్ని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి - one person died
కరీంనగర్ జిల్లా చెంజర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి