కుటుంబ కలహాలు, అనారోగ్యంతో బాధపడుతూ.. జీవితం మీద విరక్తి చెందిన ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల గట్టు కనకలక్ష్మి అనే వృద్ధురాలు కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నది. గతంలో కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ మధ్యకాలంలోనే తిరిగి ఇంటికి చేరుకుంది. ఈ విషయమై ఇంట్లో మళ్లీ గొడవ జరిగింది. మానసికంగా కృంగిపోయిన వృద్ధురాలు ఆవేశంతో మళ్లీ ఇంటినుంచి వెళ్లిపోయింది.
వృద్ధురాలు ఆత్మహత్య.. బావిలో దొరికిన మృతదేహం! - కరీంనగర్ జిల్లా వార్తలు
కుటుంబ కలహాలు, అనారోగ్యం కారణంగా ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించిన రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు గ్రామంలో, బంధువుల ఇళ్లలో గాలించినా.. ఆమె ఆచూకీ దొరకలేదు. ఆదివారం అదే గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ బావిలో మృతదేహం పడి ఉండడం గమనించిన రైతు గ్రామస్థులకు సమాచారం అందించాడు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు వచ్చి అది కనకలక్ష్మి మృతదేహంగా గుర్తించారు. అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్