హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తాజాగా జమ్మికుంటలో మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌ను పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా కొత్తపల్లిలో నిర్మిస్తున్న మురుగు కాల్వను పరిశీలించడానికి వెళ్లిన ఆయనను ఓ వృద్ధుడు నిలదీశాడు. ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నవాళ్లకే తప్ప లేని వారికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ పనులు చేయిస్తున్నారని, లేకపోతే మమ్మల్ని ఎప్పుడైనా పట్టించుకున్నారా అని బాషుమియా.. వినోద్ కుమార్‌ను ప్రశ్నించాడు. వినోద్‌కుమార్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా లేదా అని అడిగారు. దీనికి బాషుమియా సమాధానం ఇస్తూ మా ప్రాంతం ఏం అభివృద్ధి జరగలేదు. అంతా వాళ్లవైపే జరిగిందని అన్నాడు.