అవసరానికి డబ్బులు ఇచ్చిన పాపానికి... అప్పిచ్చిన వ్యక్తే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ 13 రోజులుగా ఇంటిముందు బైఠాయించిన వ్యక్తి... చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వానికి మచ్చగా మిగిలింది. శంకరపట్నం మండలంలో మెట్‌పల్లికి చెందిన ఒగ్గు కళాకారుడు వీరెల్లి సంపత్.... గతంలో సతీశ్ అనే వ్యక్తికి 32లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఎంతో బ్రతిమిలాడటంతో తీసుకున్న డబ్బుల్లో కొంత అప్పుడప్పుడు తిరిగ్గి ఇచ్చిన సతీశ్... ఇంకా 7లక్షల రూపాయలు సంపత్‌కు ఇవ్వాల్సి ఉంది. డబ్బులివ్వాలని అప్పటికే ఎంతో వేడుకున్న సంపత్.... చేసేదిలేక డబ్బులు తీసుకున్న సతీశ్ ఇంటి ముందు 2 వారాల క్రితం ఆందోళనకు దిగాడు. దీంతో సతీశ్ ఇంటికి తాళం వేసుకుని, పరారయ్యాడు.
అవసరానికి అప్పిచ్చిన పాపానికి.. ప్రాణాలే పోయాయి.. - oggu kalakarudu verelli sampath story
అవసరానికి ఆదుకునేవాడు... జబ్బు చేస్తే వైద్యం చేసేవాడు. ఎండిపోకుండా పారే ఏరు, అయ్యవారు లేని ఊరు. పల్లె జీవితంలో తప్పనిసరి అయిన అవసరాలను గుర్తించి చాటిన అద్భుత సుమతి శతకంలోని పద్యం ఎప్పటికీ నిలిచిపోయింది. పల్లెలోని అవసరాలు ఎప్పటికీ మారకున్నా.. పతనమైన విలువలతో పరిస్థితులు మాత్రం తలకిందులయ్యాయి. అవసరానికి అప్పిచ్చినందుకు రోడ్డున పడ్డ ఓ వ్యక్తి... ఆందోళన చేస్తూ అనారోగ్యపాలై.. సమయానికి వైద్యం అందక చివరకు ప్రాణాలే కోల్పోయాడు.
oggu kalakarudu verelli sampath died in karimagar
అప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంపత్.... 13రోజులుగా అక్కడే బైఠాయించటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి... చివరకు ప్రాణాలు కోల్పోయాడు. సంపత్ మృతికి కారణమైన సతీశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సతీశ్ మోసంపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా.... సివిల్ వ్యవహారమంటూ పట్టించుకోలేదని వాపోయారు.
ఇదీ చూడండి: