కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పదో ప్యాకేజీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మేడిగడ్డ నుంచి మధ్యమానేరు వరకు ఎత్తిపోతలు నిరంతరాయంగా సాగుతుండగా.. అనంతగిరి రిజర్వాయర్ పనులు పూర్తి చేశారు.
అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయించడంపై అధికారుల దృష్టి - కరీంనగర్లో అనంతగిరి రిజర్వాయర్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పదో ప్యాకేజీ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మేడిగడ్డ నుంచి మధ్యమానేరు వరకు ఎత్తిపోతలు నిరంతరాయంగా సాగుతున్నాయి. అనంతగిరి రిజర్వాయర్‌ను నీటితో నింపితే ముంపునకు గురయ్యే... అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయించడంపై అధికారులు దృష్టి పెట్టారు.
అనంతగిరి రిజర్వాయర్‌ను నీటితో నింపితే ముంపునకు గురయ్యే అనంతగిరి గ్రామాన్ని ఖాళీ చేయించడంపై అధికారులు దృష్టి సారించారు. ఇళ్లను కోల్పోతున్న వారికి పునరావాసాన్ని కల్పిస్తున్నారు. పరిహారం సరిపోవడం లేదని డబ్బు తీసుకోవడానికి నిరాకరించిన వారికి ప్రధాని ఆవాస్ యోజన నిబంధనల ప్రకారం 102 ఇళ్లను నిర్మించారు.
అనంతగిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇళ్లు ఖాళీ చేయించడానికి ప్రత్యేకంగా నలుగురు తహసీల్దార్లను నియమించారు. అనంతగిరి రిజర్వాయర్ పనులు, పునరావాస కాలనీ సదుపాయాలపై మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.