రహదారులకిరువైపులా ఆక్రమణలపై దృష్టిసారించారు కరీంనగర్ మున్సిపల్ అధికారులు. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగరపాలకసంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు: పురపాలిక హెచ్చరిక - కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు
నగర సుందరీకరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగిస్తున్నారు కరీంనగర్ పురపాలిక అధికారులు. ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
![ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు: పురపాలిక హెచ్చరిక](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5052063-thumbnail-3x2-akramana-rk.jpg)
ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు: పురపాలిక హెచ్చరిక
నగరంలో పాదచారుల ఆక్రమణలపై పోలీసుల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కమాన్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆక్రమణలను తొలగించారు. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగేది లేదని, ఎవరైనా ఆక్రమణలు తొలగించాల్సిందేనని పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 నుంచి 10వేల వరకు జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు: పురపాలిక హెచ్చరిక
ఇదీ చూడండి: అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నాం: మంత్రి తలసాని