తెలంగాణ

telangana

ETV Bharat / state

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ - నివారణ మాత్రలు

కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా రేపు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపనున్నారు. జిల్లాలో ఉన్న 19 ఏళ్లలోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నారు.

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

By

Published : Aug 7, 2019, 3:47 PM IST

జాతీయ నులిపురుగుల దినోత్సవం సంధర్భంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తామని కరీంనగర్​ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామ్ మనోహర్ రావు తెలిపారు. జిల్లాలో ఒక వెయ్యి 949 పాఠశాలల్లో ఉన్న 2 లక్షల 58270 మంది 19 ఏళ్లలోపు పిల్లలకు మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. రెండు వేల మంది సిబ్బందితో ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాలల్లో కళాశాలల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఈ మాత్ర తప్పనిసరిగా వేసుకోవాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు పిల్లలకు వేయించాలని ఆయన కోరారు.

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

ABOUT THE AUTHOR

...view details