కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాల ప్రకారం మంగళవారం కరీంనగర్‌ను పక్కనపెట్టిన ఎస్ఈసీ... హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది. కార్పొరేషన్‌లోని 60 మంది కార్పొరేటర్ పదవుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ - కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికకు నోటిఫికేషన్
19:41 January 09
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికకు నోటిఫికేషన్
రేపు నోటీసు జారీ..
రేపు స్థానికంగా రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేస్తారు. ఆ వెంటనే ఉదయం పదిన్నర నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 12 వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది. 13న నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు 14న జిల్లా ఎన్నికల అధికారి, అదనపు, ఉప ఎన్నికల అధికారుల వద్ద అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉటుంది.
27న ఓట్ల లెక్కింపు..
15న సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్ల పరిష్కారం పూర్తి చేయాల్సి ఉంటుంది. 16న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అభ్యర్థుల తుదిజాబితా ఖరారు చేసి గుర్తులు కేటాయిస్తారు. 24న కరీంనగర్ కార్పొరేషన్లో పోలింగ్ నిర్వహిస్తారు. రీపోలింగ్ అవసరమైతే 25న ఉంటుంది. 27న ఓట్లలెక్కింపు చేపడతారు.