తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లంపల్లి సర్పంచ్ స్థానానికి ఉపఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ - ఎల్లంపల్లి సర్పంచ్ స్థానానికి ఉపఎన్నిక

ఎల్లంపల్లి సర్పంచ్ స్థానానికి ఉపఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2019లో ఎన్నికైన సర్పంచ్ మరణంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంది.

notification-issued-for-by-election-for-the-post-of-yellampalli-sarpanch
ఎల్లంపల్లి సర్పంచ్ స్థానానికి ఉపఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ

By

Published : Mar 5, 2021, 5:56 PM IST

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎల్లంపల్లి సర్పంచ్ స్థానానికి ఉపఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. 2019లో ఎన్నికైన సర్పంచ్ మరణంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఆ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నెల ఎనిమిదో తేదీన ఎన్నిక కోసం నోటీసు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అదే రోజు నుంచి పదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 14వ తేదీ వరకు గడువు ఉంటుంది. 23వ తేదీన పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎల్లంపల్లి సర్పంచ్ స్థానానికి ఎన్నిక నిర్వహించాలని కోరుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నిక నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇదీ చూడండి:శ్రీనివాసమంగాపురంలో నాల్గోరోజు వార్షిక బ్రహ్మోత్సవాలు..

ABOUT THE AUTHOR

...view details