తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాక్సినేషన్​ కేంద్రాల వద్ద తగ్గిన రద్దీ

వ్యాక్సినేషన్​ పునఃప్రారంభించిన రెండో రోజు ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా టీకా వేసే​ కేంద్రాల వద్ద రద్ధీ తగ్గింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 8,637 మంది రెండో డోస్​ తీసుకున్నారు.

వ్యాక్సినేషన్​ కేంద్రాల వద్ద తగ్గిన రద్దీ
వ్యాక్సినేషన్​ కేంద్రాల వద్ద తగ్గిన రద్దీ

By

Published : May 26, 2021, 4:15 PM IST

ప్రభుత్వం రెండో విడత వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు రద్దీ కనిపించింది. రెండో రోజు మాత్రం అంతగా రద్దీ కనిపించలేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 8,637 మంది రెండో డోస్​ పొందారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 2,899, కరీంనగర్‌ జిల్లాలో 2,606, పెద్దపల్లి జిల్లాలో 1,634, సిరిసిల్ల జిల్లాలో 1,558మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

కొవాగ్జిన్​ తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో రెండో రోజు మాత్రం అంతగా రద్దీ కనిపించ లేదు. జగిత్యాల జిల్లాలో 23, కరీంనగర్‌ జిల్లాలో 26, పెద్దపల్లి జిల్లాలో 25, సిరిసిల్ల జిల్లాలో 15 కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. గతంలో 200కు పైగా ఉన్న కేంద్రాలను 89కి కుదించారు. పట్టణ, మండల కేంద్రాల్లోని ఆరోగ్యకేంద్రాల్లోనే వ్యాక్సిన్​ ఇస్తున్నారు.

ఇదీ చదవండి:ఆర్మీ ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్‌

ABOUT THE AUTHOR

...view details