తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్శకుర్తిలో ఒకరికి కరోనా పాజిటివ్​... గాంధీకి తరలింపు - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

గంగాధర మండలం గర్శకుర్తిలో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి పంపించి... కుటుంబ సభ్యులను క్వారంటైన్​కు తరలించారు.

new corona positive case registered
గర్శకుర్తిలో ఒకరికి కరోనా పాజిటివ్​, గాంధీకి తరలింపు

By

Published : Jun 25, 2020, 7:54 PM IST

కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. పది రోజుల క్రితం ముంబయి నుంచి కొందరు స్వగ్రామానికొచ్చారు. వారిలో క్షయ వ్యాధితో బాధపడుతున్న ఓవ్యక్తి రెండు రోజుల క్రితం కరీంనగర్ ప్రధానాస్పత్రిలో వైద్య పరీక్ష చేయించుకోగా... కరోనా పాజిటివ్ వచ్చింది.

అప్రమత్తమైన వైద్యాధికారులు బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కరోనా కేసు నమోదు అవ్వడం వల్ల గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు వైరస్​ సోకిన వ్యక్తి కుటుంబంతోపాటు అతడికి క్షౌరం చేసిన వ్యక్తిని క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చూడండి :తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేత..!

ABOUT THE AUTHOR

...view details