కొవిడ్ 19లో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. పట్టణంలోని 59వ వార్డులో పనిచేస్తున్న కార్మికులకు చీరలు, ప్యాంటు, షర్టులను డివిజన్ కార్పొరేటర్ మాధవి మహేశ్.. మేయర్ సునీల్‌రావు చేతులమీదుగా పంపిణీ చేశారు. కార్పొరేటర్ మాధవిని ఆదర్శంగా తీసుకుని అన్ని డివిజన్లలోని కార్పొరేటర్లు తమతమ డివిజన్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు బట్టలను పంపిణీ చేయాలని మేయర్ కోరారు.
పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ నూతన వస్త్రాల బహుకరణ - కరీంనగర్లో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ
కరోనా నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్మికులు చేసిన సేవలు అభినందనీయమని మేయర్ సునీల్ రావు తెలిపారు. పట్టణంలోని 59వ వార్డులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ మాధవి అందిస్తున్న నూతన వస్త్రాలను ఆయన పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు మేయర్ నూతన వస్త్రాల బహుకరణ
కరోనా నివారణలో భాగంగా కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి అందించే బతుకమ్మ చీరలతో పాటు కార్పొరేటర్ మాధవి స్వయంగా కొనుగోలు చేసి కార్మికులకు నూతన వస్త్రాలను ఇవ్వడం సంతోషంగా ఉందని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:'ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న పండుగ కానుక బతుకమ్మ చీర'