రాష్ట్ర వ్యాప్తంగా కోటి 30 లక్షలకుపైగా ఎకరాల్లో ఏ రకమైన పంటలు వేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందనే అంశాలు ఉన్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రైతులు ఒకే రకమైన పంట వేయడం ద్వారా ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నియంత్రిత సాగువిధానంపై సమావేశం జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.
'నియంత్రిత వ్యవసాయం విధానంపై ఆందోళన అక్కర్లేదు' - కరీంనగర్ తాజా వార్తలు
నియంత్రిత వ్యవసాయం విధానంపై రైతులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దగా మార్పులేమి లేవని అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నియంత్రిత సాగువిధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం పంటలకు నీరు, ఉచిత కరెంటు అందిస్తున్నామని మంత్రి కొప్పుల చెప్పారు. అన్ని అందుబాటులో ఉన్న తర్వాత వాటిని ఉపయోగించి రైతులు సరియైన పంటలు పండించాలని కొప్పుల సూచించారు. రైతులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంటల్లో చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మనం పండించే వరిలో 50 శాతం సన్న రకం, 50 శాతం దొడ్డు రకం వరి పంట వేయాలన్నారు. ప్రస్తుతం 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాం.. దానిని 65 లక్షల ఎకరాలకు పెంచాలన్నారు. మిగతా పంటలు కూడా ఆయా జిల్లాల వారీగా ఎంత మేరకు సాగుచేయాలనే దానిపై జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతారని వివరించారు. కొత్త వ్యవసాయ విధానం ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాల వారీగా రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి :'అడవుల నరికివేత వల్లే కరోనా వైరస్'